Atal Pension Yojana Benifits: అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు పెన్షన్ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో చేరిన కార్మికులు 60 సంవత్సరాల వయస్సు తర్వాత పెన్షన్ రూపంలో అందుకుంటారు.
ప్రైవేటుగా పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులుగానీ పెన్షన్ లాంటి వాటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం సాధారణ పెన్షన్ అందించేందుకు కొన్ని పథకాలు తీసుకొచ్చింది. వాటిలో ఒకటి అటల్ పెన్షన్ యోజన పథకం. Also Read: 7th Pay Commission: తెరపైకి కొత్త వేతన కోడ్, PF Contributionతో పాటు ఉద్యోగుల జీతాల్లో మార్పులు
అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరేందుకు 18 ఏళ్లు నిండి ఉండాలి. ప్రైవేటుగా అసంఘటిత రంగంలో కార్మికులుగా చేస్తున్న వారు అర్హులు. ఇందులో చేరి నెల నెలా కొంత నగదు చెల్లిస్తే 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెలా పెన్షన్ పొందుతారు. Also Read: PM Kisan Samman Nidhi నిబంధనల్లో భారీ మార్పులు, ఇకపై వారికి రూ.6 వేలు జమ కావు
కనిష్టంగా 42 రూపాయల నుంచి వయసు ఆధారంగా రూ.210 వరకు ప్రతినెలా చెల్లించాల్సి ఉంటుంది. పైన ఉన్న పట్టిక గమనిస్తే వయసు, వారు ప్రతినెలా జమ చేయాల్సిన నగదు వివరాలు అర్థమవుతాయి. Also Read: EWS Reservation: ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరెవరు పొందవచ్చు, ఈ కండీషన్స్ తెలుసుకోండి
40 ఏళ్లు నిండిన వారు అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి అవకాశం లేదు. 18 నుంచి 40ఏళ్ల లోపు ఉన్నవారు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరి చివరి రోజుల్లో ప్రతినెలా పెన్షన్ పొంది గౌరవంగా బతకవచ్చు. నామినీ సదుపాయం కల్పించింది. ఒకవేళ స్కీమ్ కట్టిన వ్యక్తి చనిపోతే నామినీకి ప్రయోజనాలు అందుతాయి.
అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరాలనుకున్న వారికి కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. దానికి ఆధార్ కార్డును అనుసంధానం చేయాలి. ఈ స్కీములో చేరి ఎక్కడికీ వెళ్లకుండానే ప్రతి నెలా డబ్బులు పెన్షన్ స్కీమ్‌లో చేరేలా చేసుకోవచ్చు. Also Read: PM Kisan Scheme: రైతులు పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలంటే కొత్త రూల్స్ ఇవే